కలం, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ కొద్ది సేపటి క్రితమే రిలీజ్ అయింది. అనిల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ అని అందరికీ తెలిసిందే. మొదటి నుంచి ఈ మూవీ ప్రమోషన్లు వేరేగా ఉండటంతో కథ కొత్తగా ఏమైనా ఉంటుందని అంతా అనుకున్నారు. ట్రైలర్ చూస్తే ఆ కథ వెంకటేశ్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా లాగానే అనిపిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాకపోతే ఇందులో కొంచెం డిఫరెంట్ యాంగిల్ అని ట్రైలర్ ను బట్టి అర్థం అవుతోందని అంటున్నారు చిరంజీవి ఫ్యాన్స్.
సంక్రాంతికి వస్తున్నాం మూవీలో వెంకటేశ్ మాజీ పోలీసు అధికారిగా ఉంటాడు. పోలీసులకు అవసరం అయినప్పుడు వెళ్లి స్పెషల్ ఆపరేషన్ లో పాల్గొంటాడు. ఈ ట్రైలర్ లో చిరంజీవి (Chiranjeevi) ఒక రా ఏజెంట్ అని చూపించారు. వెంకటేశ్ భార్య చేతిలో ఎలాగైతే తగ్గి ఉంటాడో.. ఇందులో కూడా చిరంజీవి అలాగే నయనతార చేతిలో తగ్గి ఉన్నట్టు కొన్ని సీన్లు చూపించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేశ్ ఇంట్లో వంట చేస్తూ భార్య చెప్పినట్టే వింటాడు. ఈ మన శంకర వర ప్రసాద్ మూవీలోనూ అలాగే ఉంది చిరంజీవి పాత్ర. పోలీసులకు అవసరం అయినప్పుడు చిరంజీవి కూడా తనలోని మరో కోణాన్ని బయటకు తీస్తాడేమో అంటూ పోస్టులు పెడుతున్నారు ఆయన ఫ్యాన్స్.


