కలం, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ట్రైలర్ (MSVPG Trailer) వచ్చేసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా వచ్చిన ట్రైలర్ ఫుల్ లెంగ్త్ కామెడీ యాంగిల్ లోనే కనిపిస్తోంది. క్రిమినల్స్ ను ఉతికి ఆరేస్తాడు.. తప్పు చేస్తే కోసి కారం పెడతాడు లాంటి డైలాగులు బాగానే ఉన్నాయి. అయితే ఇందులో కూడా హీరో పాత్రను ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు.. ఇంజెలిజెన్స్ రా ఏజెంట్ గా చూపించబోతున్నాడు అనిల్ రావిపూడి. గతంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోనూ వెంకటేశ్ పాత్రను ఇలాగే చూపించాడు అనిల్.
అయితే ఈ సారి ఇంకొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వెంకటేశ్ ఎంట్రీ సీన్ ను కూడా ఇందులో చూపించారు. ప్రతి సినిమాలో లాగే ఇందులో కూడా భార్య, భర్తల గొడవలను చూపించబోతున్నాడని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. చిరు, నయనతార మధ్య వచ్చే కామెడీ సీన్లు పెట్టాడు అనిల్ రావిపూడి. చిరు ఇందులో గత సినిమాల కంటే స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.
Read Also: ఇంట్రెస్టింగ్ గా వెంకీ మామ పాత్ర.. అనిల్ ప్లాన్ అదిరిందిగా
Follow Us On: Sharechat


