కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో వస్తున్న ఫన్ టాస్టిక్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). ఈ సినిమాలో చిరూ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార(Nayanthara) హీరోయిన్ గా నటిస్తుంది. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా వెంకీ పాత్రకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బాగా వైరల్ అవుతుంది.
సినిమా కథ ప్రకారం హీరోయిన్ నయనతార పాత్ర రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు, ఆ సంబంధం కోసం వచ్చే హీరోగా వెంకటేష్ కనిపించానున్నారట. కానీ అప్పటికే చిరు, వెంకీల మధ్య మంచి స్నేహం ఉండటం.. ఇది తెలియని నయనతారతో వారిద్దరూ కలిసి చేసే కామెడీ ఎలిమెంట్స్ సినిమాకే హైలైట్ కానుందని సమాచారం. మెగాస్టార్ నుంచి మూవీ వచ్చి ఏడాదికి పైనే కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి లుక్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఛాన్నాళ్ళ తరువాత మెగాస్టార్ నుంచి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ మూవీ రానుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ సైతం థియేటర్ కి వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) మూవీ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12 న గ్రాండ్ రీలీజ్ కి సిద్దం అవుతుంది.


