కలం, సినిమా : టాలీవుడ్ హాట్ బ్యూటీ డింపుల్ హయతి (Dimple Hayathi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో రవితేజతో నటించిన “ఖిలాడీ” సినిమాతో ఈ భామ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అలాగే సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ భామ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించారు. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ ఆషిక రంగనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇందులో భాగంగా మేకర్స్ వరుస ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డింపుల్ హయతి వేణు స్వామి (Venu Swamy) గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. వేణు స్వామి చేత తాను జరిపించిన పూజలపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ గురించి ప్రశ్నించగా కేవలం పూజల వల్ల స్టార్స్ అయిపోతారు అంటే నేను అస్సలు నమ్మను. పెద్దవాళ్ళు చెప్పినట్లు గుడికి వెళ్ళి పూజలు చేయిస్తుంటాము. పూజలు చేసినంత మాత్రానా సక్సెస్ రాదు దేనికైనా సమయం రావాలి. అప్పుడే అన్ని నిజాలు బయటకు వస్తాయని ఫేట్ మారాలంటే కావాల్సింది కష్టం, ఓపిక అంతే అని డింపుల్ తెలిపింది.

Read Also: ఇంట్రెస్టింగ్ గా వెంకీ మామ పాత్ర.. అనిల్ ప్లాన్ అదిరిందిగా
Follow Us On: Youtube


