Kuldeep Yadav | ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడుతున్న ఇండియా జట్టులో కీలక మార్పు చోటు చేసుకోనుంది. తొలి వన్డేలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా.. రెండో మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటోంది. ఓటమితో సిరీస్‌ను ప్రారంభించిన టీమిండియా.. సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవాల్సిందే. అంటే రెండో మ్యాచ్ నుంచే జైత్రయాత్ర స్టార్ట్ చేయాలి. అందుకోసమే అడిలైడ్‌లో జరిగే రెండో వన్డేకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే కంగారు జట్టును రెండో వన్డేలో ఢీకొట్టే తుది జట్టులో పలు మార్పులు చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ఈ మార్పుల్లో భాగంగానే రెండో వన్డేకు టీమిండియా తుది జట్టులోకి కుల్‌దీప్ యాదవ్(Kuldeep Yadav) ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్ వినిపిస్తోంది. కాగా, కుల్‌దీప్.. ఎవరి స్థానంలో జట్టులో స్థానం దక్కించుకుంటాడు అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. నితీశ్ కుమార్ స్థానంలో అని కొందరంటే.. తొలి వన్డేలో బ్యాట్, బౌల్ రెండింటితో చప్పగా ప్రదర్శించిన హర్షిత్ రాణా స్థానంలో అని మరికొందరు అంటున్నారు. మరి కుల్‌దీప్.. ఎవరి స్థానంలో మైదానంలోకి అడుగు పెడతాడో చూడాలి.
Read Also: బంద్‌కు రెడీ అయిన ప్రైవేట్ కాలీజీలు.. ఎప్పటి నుంచి అంటే..

