epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రాజాసాబ్‌లో ఆ హీరోయిన్‌ది సైడ్ క్యారెక్ట‌రే : మారుతి

క‌లం సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్(Prabhas) లేటెస్ట్ మూవీ రాజాసాబ్(Raja Saab) మ‌రికొద్ది రోజుల్లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. మారుతి(Maruthi) డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. ప్ర‌భాస్ మిన‌హా మూవీ టీం అంతా ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న హీరోయిన్లుగా న‌టించిన‌ ముగ్గురు భామ‌లు మాళ‌వికా మోహ‌న‌న్‌(Malavika Mohanan), రిద్ది కుమార్‌(Riddhi Kumar), నిధి అగ‌ర్వాల్‌(Nidhhi Agerwal)ల‌కు విప‌రీతంగా క్రేజ్ ఏర్ప‌డింది. మూవీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా డైరెక్ట‌ర్ మారుతి సినిమాలో హీరోయిన్ల పాత్ర‌ల గురించి హాట్ కామెంట్స్ చేశారు. సినిమాలో మెయిన్ క్యారెక్ట‌ర్లు నిధి, మాళ‌వికాయేన‌ని, రిద్ధి కేవ‌లం స‌పోర్టింగ్ రోల్‌లాంటిదేన‌ని చెప్పారు. అంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్ట‌ర్ కాద‌ని, ఫ్రెండ్ క్యారెక్ట‌ర్‌లాంటిద‌ని అన్నారు. అయితే రిద్ది ప‌ర్ఫామెన్స్ చాలా బాగుంటుంద‌ని, ఆమె ఫ్యూచ‌ర్‌లో స్టార్ అయ్యే ఛాన్స్ ఉంద‌న్నారు. రాజాసాబ్‌లో మాత్రం రిద్ది త‌క్కువ సీన్ల‌లోనే ఉంద‌ని చెప్పారు. దీంతో రిద్ది ఫ్యాన్స్ కాస్త డిస‌ప్పాయింట్ అవుతున్నారు. ఇటీవ‌ల రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిద్ది కుమార్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ప్ర‌భాస్ త‌న‌కు చీర గిఫ్ట్ ఇచ్చాడ‌ని, ఆ చీర‌నే మూడేళ్లు దాచుకొని ఈవెంట్‌కు క‌ట్టుకొచ్చాన‌ని రిద్ది చెప్పింది. దీంతో సోష‌ల్ మీడియాలో ఈ టాపిక్ ఫుల్ వైర‌ల్ అయిపోయింది. ప్ర‌భాస్ ఎవ‌రికైనా ఫుడ్ పెడ‌తాడు కానీ గిఫ్ట్‌లు ఇచ్చిన‌ట్లు ఎక్క‌డా విన‌లేదే.. అందులోనూ హీరోయిన్‌కు చీర ఇవ్వ‌డ‌మా? అంటూ నెటిజ‌న్లు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకున్నారు. రాజాసాబ్ జ‌న‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఎవ‌రి పాత్ర ఎలా ఉందో చూడాలంటే మ‌రికొద్దిరోజులు వేచి చూడాలి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>