కలం/ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలు అధికంగా జరిగే 30 జంక్షన్ ల వద్ద ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి (Anudeep Durishetty) అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ బస్సులు ఫిట్ నెస్ తో పాటు ఓవర్ లోడింగ్ కాకుండా చూడాలని అన్నారు. విద్యాసంస్థల బస్సు వెనక్కి రాష్ డ్రైవింగ్ చేస్తే ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలిపే ఫోన్ నెంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో గత 3 సంవత్సరాలలో సుమారు 3200 పైగా ప్రమాదాలు జరిగాయని, 30 జంక్షన్ లలో 50 శాతం పైగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. జంక్షన్ల వద్ద రోడ్డు భద్రతా ప్రమాణాలు చేపడితే ప్రమాదాలు నియంత్రించవచ్చని అన్నారు.
30 జంక్షన్ల వద్ద వాహనాల వేగం తగ్గించేందుకు రంబుల్ స్ట్రీప్స్, లేన్ మార్కింగ్, రాత్రి వేళల్లో సరిగ్గా కనిపించేందుకు ఏర్పాట్లు, ఆక్రమణల తొలగింపు, జీబ్రా క్రాసింగ్, సైన్ బోర్డ్స్, బ్లింకర్స్ ఏర్పాటు వంటి చర్యలు రాబోయే 15 రోజులలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏఐ సాంకేతికతను వాడుతూ రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతి వేగంగా ప్రయాణించే వాహనాలను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వైరా రోడ్డు వరకు 10 ఫీట్ ఫుట్ పాత్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలో వీలైనంత మేరకు ఫుట్ పాత్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పాత బస్టాండ్ వద్ద ట్రాఫిక్ నియంత్రించాలని కలెక్టర్ తెలిపారు.

Read Also: కొత్త డీసీసీ జాబితాకు AICC ఆమోదం.. లిస్ట్ ఇదే
Follow Us On: Instagram


