కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో కలుషిత నీటిని నివారించేందుకు, లీకేజీలు అరికట్టేందుకు జలమండలి (Hyderabad Water Board) అధునాతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ మెషిన్ అనే యంత్రాన్ని అందుబాటులులోకి తీసుకొచ్చింది. దీన్నే పైప్ ఇన్ స్పెక్షన్ కెమెరా సిస్టం అంటారు. ఈ టెక్నాలజీ ద్వారా హైదరాబాద్ నగరాన్ని వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుతామని అధికారులు చెబుతున్నారు.
కలుషిత నీటి సమస్యలను జీరోకు తగ్గించనున్నట్టు జలమండలి అధికారులు స్పష్టం చేశారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి శనివారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై ఆరా తీశారు. కలుషిత నీటికి సంబంధించిన ఫిర్యాదులు ఏయే ప్రాంతాల నుంచి అధికంగా వస్తున్నాయి? తరచూ ఫిర్యాదులు వస్తున్న ప్రాంతాలు ఏవి? అని ఆరా తీశారు.
డివిజన్ వారీగా కాలం చెల్లిన పైపు లైన్ల వివరాలు సేకరించారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు ఫిర్యాదులు అందే ప్రాంతాల్లో పైపు లైన్ల వివరాలను సేకరించాలని చెప్పారు. ఆ ప్రాంతాల్లో పైపు లైన్ల పటిష్టతను అంచనా వేసి మార్చడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కాలం చెల్లిన పైపు లైన్ల స్థానంలో కొత్త పైపు లైన్ల నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పనులు పూర్తి చేయడానికి సరైన కార్యాచరణ వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రానున్న రెండు నెలల్లో పైప్ లైన్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయడానికి సిద్ధం కావాలని అధికారులను కోరారు. దానికి సంబంధించిన కొత్త పైప్ లైన్ నిర్మాణ పనుల అంచనాలు వెంటనే సమర్పించి ఆమోదం పొందాలని సూచించారు.
ఇప్పటికే కలుషిత నీరు కనిపెట్టేందుకు.. జలమండలి ఇప్పటికే కలుషిత నీరు, లీకేజీలు అరికట్టడానికి జలమండలి రోబోటిక్ టెక్నాలజీతో పనిచేసే పొల్యూషన్స్ ఐడెంటిఫికేషన్ మెషిన్ అనే యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని ఈ సందర్బంగా ఎండీ వివరించారు. దీన్ని పైప్ ఇన్ స్పెక్షన్ కెమెరా సిస్టం అని కూడా అంటారని దీని ద్వారా కలుషిత నీటి సరఫరా, లీకేజీలను త్వరగా గుర్తించి సమస్యలను పరిష్కరిస్తామని అని చెప్పారు.
Read Also: పంట కాల్వల మెయింటెనెన్స్ పట్టించుకోవట్లే : కల్వకుంట్ల కవిత
Follow Us On: Pinterest


