కలం, వెబ్ డెస్క్ : ఇండియన్ స్నాక్ ఐటెమ్స్ లో సమోసా కి ప్రత్యేక స్థానం ఉంది. సమోసాలు లేకుండా భారతీయుల జీవితం ఊహించుకోవడం కష్టమే. వేడి వేడిగా వేసే సమోసాలు (Samosa) తింటూ ఛాయ్ తాగనిదే ఆ రోజు గడిచినట్లుండదు. మన వాళ్ళు ఎక్కడున్నా సమోసాని మాత్రం వదలరు. సాధరణంగా ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఆహారపదార్ధాలు అమ్ముతూ ఉంటారు. లండన్ రైళ్లలో (London Trains) కూడా సాధారణంగా శాండ్‌విచ్‌లు, కాఫీలు అమ్ముతారు కానీ, ఒక భారతీయ వ్యక్తి ఏకంగా వేడివేడి సమోసాలను అమ్ముతూ తెగ హడావుడి చేస్తున్నాడు.
లండన్ అండర్‌గ్రౌండ్ రైలులో ఆ యువకుడు సమోసాలు (Samosa) అమ్ముతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ వీడియోలో సాంప్రదాయ ధోతీ-కుర్తా ధరించి, తలపాగా చుట్టుకుని సమోసా.. సమోసా.. వన్ పౌండ్ అంటూ అరుస్తూ అక్కడి ప్రయాణికులకు మన సమోసా రుచి చూపిస్తున్నాడు. ఈ వ్యక్తి బీహార్ నుంచి లండన్ కి వెళ్ళి హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నట్లుగా గుర్తించారు.
The South Harrow Samosa Seller Is Going Viral—And Commuters Are Begging Him To Move To The Victoria Line #SouthHarrow #LondonLife #TubeSnacks #SamosaMan #LondonFood #VictoriaLine #TfL #LondonUnderground pic.twitter.com/iULvx4JYvq
— Kalam Daily (@kalamtelugu) January 3, 2026
Read Also: బస్ డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడిదాకా… సత్యసాయి బాబా ఫాలోవర్ మాదురోకు ట్రంప్ షాక్!
Follow Us On: Instagram


