కలం, వెబ్ డెస్క్: దేశంలోని అన్ని ఎన్నికలకు సంబంధించిన సేవలను ఒకే చోట అందించేందుకు ఈసీ ఓ యాప్‌ను (ECINet App) అందుబాటులోకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈసీఐ నెట్ పేరున ఈ అప్లికేషన్‌ను రూపొందించింది. అయితే ఈ యాప్‌కు సంబంధించి ఎన్నికల సంఘం ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్‌ను కోరుతోంది. అధికారికంగా యాప్ అందుబాటులోకి రాకముందే ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ కోరుతోంది.
ఏమిటీ యాప్
ఈసీఐనెట్ యాప్ ఎన్నికల సమాచారానికి, సేవలకు సంబంధించిన యాప్. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి మొత్తం 40 యాప్‌లు ఉన్నాయి. వీటన్నంటిని కలిపి ఒకే యాప్ గా రూపొందించబోతున్నారు. cVIGIL (సీవిజిల్), Saksham (సాక్ష్యం), Polling Trends, Know Your Candidate (KYC) వంటి యాప్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటన్నింటి బదులు ఒకే యాప్ లో అన్ని సేవలు ఉండేలా కొత్త యాప్ రూపొందించారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్నికల సేవలకు వేగంగా వ్యాప్తి చేయడం, పోలింగ్ శాంత వేగంగా తెలుసుకోవడం వంటివి వేగంగా తెలుసుకోవడం కోసం ఈ యాప్ రూపొందించారు. పోలింగ్ పూర్తైన తర్వాత 72 గంటల్లోనే ఇండెక్స్ కార్డ్‌లు జనానికి అందిస్తారు. ఇదే పాత వ్యవస్థలో వారాలు లేదా నెలలు పట్టేది.
ఇప్పటికే ట్రయల్స్
ఈ యాప్‌కు సంబంధించిన ట్రయల్స్ కూడా మొదలుపెట్టారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, తరువాత జరిగిన ఉప ఎన్నికలలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ప్రస్తుతం ప్రజలు ECINet యాప్‌ను వినియోగించి, అభిప్రాయాలు, సూచనలను యాప్‌లోని ‘Submit a Suggestion’ అనే ప్రత్యేక ట్యాబ్ ద్వారా పంపొచ్చు. సూచనలు జనవరి 10, 2026 వరకు పంపించే అవకాశం ఉంది. కమిషన్ ఈ సూచనలను తీసుకొని యాప్ ను మరింత మెరుగ్గా మార్చనున్నది. ఈ నెలలోనే అధికారికంగా ఈ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also: స్క్రాప్ నుంచి సూపర్ బైక్.. ఇండియా స్టూడెంట్స్ ఇన్నొవేషన్ అదరహో!
Follow Us On: Pinterest


