కలం, వెబ్ డెస్క్ : బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ఇంట్లో పెళ్లీ బాజా మొగనున్నది. గత కొన్నాళ్లుగా సాగుతున్న ప్రచారానికి కృతి సనన్ (Kriti Sanon ) చెల్లెలు నుపూర్ సనన్ (Nupur Sanon) తెరదించేశారు. తన బాయ్ ఫ్రెండ్ ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్ (Stebin Ben) తో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను నుపూర్ సనన్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అందమైన లొకేషన్ లో ‘Will you marry me’ అని రాసిన ప్లకార్డులు బ్యాక్ డ్రాప్ లో ఉండగా.. స్టెబిన్ బెన్ మోకాళ్లపై కూర్చొని నుపూర్ సనన్ ప్రపోజ్ చేశాడు. దీనికి మురిసిపోతూ ‘యస్’ చెప్పింది.
ఈ అయోమయ ప్రపంచంలో.. నేను చెప్పిన అంత్యంత సులువైన పదం ‘యస్’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. నుపూర్ తన చేతిలోని భారీ డైమండ్ ఎంగేజ్ మెంట్ రింగ్ ఆనందంగా చూపిస్తూ కనిపించారు. ఇంకో ఫోటోలో నటి కృతి సనన్ కూడా ఈ జంటతో కలిసి కనిపిస్తూ వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ క్షణం సనన్ కుటుంబంలో మరపురాని క్షణాలుగా మారడంతో పాటు కృతి సనన్ (Kriti Sanon) అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.
Read Also: కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎప్పుడు? ఎవరితో?
Follow Us On: Youtube


