epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అసెంబ్లీలో ‘జల’ చర్చ.. గాఢ నిద్రలో ఎమ్మెల్యేలు (వీడియో)

కలం, వెబ్​ డెస్క్​ : MLAs Sleeping | తెలంగాణ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన కృష్ణా, గోదావరి నదీ జలాల వాటా పై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తూ సుదీర్ఘ చర్చ జరుపుతున్న వేళ ప్రతిపక్ష ఎమ్మెల్యేల తీరు విస్మయానికి గురిచేసింది. ప్రజల గొంతుకగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు సభలో చర్చ జరుగుతుండగా నిద్రలోకి జారుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

వైరల్ అవుతున్న ఈ ఫొటోలో సిర్పూర్​ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్​ బాబు, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గాఢ నిద్రలో (MLAs Sleeping) కనిపిస్తున్నారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల వైఫల్యాలు, గత ప్రభుత్వ తప్పిదాల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యంత కీలకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇస్తుండగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది.

రాష్ట్ర రైతాంగం ఎదురుచూస్తున్న సాగునీటి (Water Debate) అంశంపై మంత్రి గణాంకాలతో వివరణ ఇస్తుంటే, ఈ ఎమ్మెల్యేలు మాత్రం హెడ్ ఫోన్లు పెట్టుకుని మరీ నిద్రపోతూ కెమెరా కంటికి చిక్కారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే వీరికి నిద్రే ముఖ్యమా అని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చించే అత్యున్నత వేదికపై ఇలాంటి బాధ్యతారాహిత్యం తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: కృష్ణాలో 34% నీళ్లు కేసీఆర్ చాలన్నారు.. మంత్రి ఉత్తమ్ కామెంట్లు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>