epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మా ఫ్యామిలీ అంతా నాన్ వెజ్.. నేను ప‌క్కా వెజిటేరియన్ : జెనీలియా

క‌లం వెబ్ డెస్క్ : స‌త్యం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి, వ‌రుస హిట్ల‌తో ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన బ్యూటీ జెనీలియా (Genelia). బొమ్మ‌రిల్లు హాసినిగా తెలుగు ఆడియెన్స్‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోయే ఈ ముద్దుగుమ్మ కెరీయ‌ర్ పీక్స్‌లో ఉండ‌గానే త‌న ప్రియుడు, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను (Ritesh Deshmukh) పెళ్లాడి సినిమాల‌కు గుడ్ బై చెప్పేసింది. ఇద్ద‌రు పిల్ల‌లకు జ‌న్మ‌నిచ్చి, పిల్ల‌లు కాస్త‌ పెద్ద వాళ్ల‌య్యాక ఇటీవ‌ల మ‌ళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. జెనీలియా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. త‌న సినిమాల కంటే వ్య‌క్తిగ‌త విష‌యాల‌పైనే నెటిజ‌న్లు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇటీవ‌ల జెనీలియా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ఫుడ్ హ్యాబిట్స్‌పై ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేసింది. త‌న ఫ్యామిలీలో అంతా నాన్ విజిటేరియ‌న్స్ అని, తాను మాత్రం ప్యూర్ వెజిటేరియ‌న్ అని చెప్పుకొచ్చింది. ఇంకా తాను ఎలాంటి జంతు ఉత్ప‌త్తుల‌ను తిన‌కుండా వీగ‌న్‌గా మార‌డానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రించింది.

 జెనీలియా, ప్ర‌ముఖ న‌టి సోహా అలీ ఖాన్ (Soha Ali Khan) యూట్యూబ్ ఛానల్‌లో ఇటీవ‌ల‌ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంట‌ర్వ్యూలో 2017లోనే తాను నాన్‌వెజ్ మానేసిన‌ట్లు చెప్పింది. కానీ, అప్పుడు పూర్తి శాఖాహారిగా మార‌లేద‌ని, మిల్క్ ప్రొడక్ట్స్, చీజ్, గుడ్లు తినేదాన్న‌ని తెలిపింది. టైం వ‌చ్చిన‌ప్పుడు జ‌ర‌గాల్సింది జ‌రుగుతుంద‌ని, త‌న‌కూ ఆహార‌పు అల‌వాట్ల విష‌యంలో అదే జ‌రిగింద‌ని జెనీలియా పేర్కొంది. త‌న ఆరోగ్యంపై స్వార్థంతోనే వీగ‌న్‌గా మారిన‌ట్లు జెనీలియా చెప్పింది. తాను మాంసం తినే కుటుంబంలో పుట్ట‌డం వ‌ల్ల‌ శాఖాహారం గురించి మొద‌ట్లో ఎక్కువగా తెలియద‌ని, బఠాణీలు, బంగాళదుంపలు, పనీర్ మాత్రమే తెలుస‌ని చెప్పింది. జెనీలియాకు జంతువులంటే ఎంతో ఇష్ట‌మని. అయినా నాన్ వెజ్ బాగా ఎంజాయ్ చేస్తూ తినేదాన్న‌ని తెలిపింది. కానీ, త‌ర్వాత నాన్‌వెజ్ తిన‌డం త‌గ్గించి వేరే వాటిలో కూడా ఆనందం దొరుకుతుందని తెలుసుకున్నానంది.

వెజిటేరియ‌న్‌గా మారిన త‌ర్వాత తాను ఫుడ్ గురించి చాలా విష‌యాలు తెలుసుకున్న‌ట్లు జెనీలియా (Genelia) వివ‌రించింది. “రోజూ భోజనం చేశాక‌ చాలా తేలికగా అనిపించేది. ఈ విధానాన్ని జీవితంలో అవలంబించాలని మరింత క్రమశిక్షణతో ఉండేదాన్ని” అని చెప్పింది. జెనీలియా 2020లో కోవిడ్‌ సమయంలో వీగన్ అయింది. మొదట రితేష్ 2016లో మాంసం మానేయ‌గా, త‌ర్వాత‌ రెండు నెలలు స‌మ‌యం తీసుకొని జనవరి 1, 2017 నుంచి జెనీలియా నాన్‌వెజ్ మానేసింద‌ట‌. మొద‌ట్లో ఇద్ద‌రూ గుడ్లు, జంతు ఉత్పత్తులు తినేవాళ్లు. తర్వాత కోవిడ్ రావ‌డంతో జంతు ఉత్పత్తులు కూడా మానేద్దామ‌ని రితేష్ చెప్పాడ‌ట‌. ఆ స‌మ‌యంలో అంద‌రూ ఇంట్లోనే ఉండ‌టంతో ‘సరే, ఇంట్లోనే ఉన్నాం, ట్రై చేద్దాం.. అని జెనీలియా ఒకే చెప్పింద‌ట‌. అలా మొద‌లైన వారి శాఖాహార ప్ర‌యాణం స‌క్సెస్‌ఫుల్‌గా కొన‌సాగుతుంద‌ని జెనీలియా చెప్పుకొచ్చింది. మొదట్లో ఆరోగ్య కారణాల‌తోనే ప్రారంభించినా కాలం గడిచేకొద్దీ పర్యావరణం, జంతువులకు చాలా దగ్గరైన‌ట్లు చెప్పింది.

Read Also: రీడింగ్‌తో నాలెడ్జ్ మాత్రమే కాదు.. హెల్త్ బెనిఫిట్స్ కూడా!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>