కలం, వెబ్ డెస్క్: Rajinikanth- Kamal Haasan | తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల కూలీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నెల్సన్ డైరక్షన్ లో రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా తలైవా 173వ మూవీ బిగ్ అప్డేట్ వచ్చేసింది. లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా, యంగ్ డైరెక్టర్ శిబి చక్రవర్తి (Shibi Chakravarthy) ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా రాజ్‌కమల్ ఫిల్మ్స్ (Rajkamal Films) స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ కి ‘ప్రతి ఫ్యామిలీకి ఒక హీరో ఉంటారు’ అనే ట్యాగ్ లైన్ ని కూడా యాడ్ చేశారు. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ (Anirudh) మ్యూజిక్ అందిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టు ముందుగా సుందర్.సి (Sundar.c) డైరెక్టర్ గా మొదలయ్యింది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ కాంబినేషన్ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. దాంతో యంగ్ డైరెక్టర్ శిబి చక్రవర్తికి రజనీని డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

Read Also: రాంచరణ్ ఫ్యాన్స్ కి షాక్ .. పెద్ది రిలీజ్ వాయిదా
Follow Us On: Instagram


