కలం వెబ్ డెస్క్ : ఇటీవల ఏలూరు(Eluru) జిల్లాలో ప్రేమ వివాహం(Love Marriage) చేసుకున్న యువకుడిపై దాడి కేసులో పోలీసులు(Police) ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లాలోని మండవల్లి మండలం కారుకొల్లుకు చెందిన సాయిచంద్, ముసునూరు మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన సాయిదుర్గ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకొని ఇటీవల ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఫోటోలను సాయిచంద్ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడంతో యువతి బంధువులకు విషయం తెలిసి సాయిచంద్‌ను స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం యువతిని తమవెంట తీసుకొని వెళ్లారు. తనపై జరిగిన దాడిపై సాయిచంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యను కిడ్నాప్ చేశారని, తనను స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి సాయిదుర్గ తల్లిదండ్రులు కందుల బాబు, విజయలక్ష్మితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.


