కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసులకూ విస్తరించింది. ఈ నిర్ణయ అమలు సందర్భంగా చెన్నైలో ప్రయాణిస్తున్న ఓ ప్రభుత్వ బస్సులో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) స్వయంగా కండక్టర్ అవతారం ఎత్తారు. బస్సులోని మహిళా ప్రయాణికులకు ఆయన స్వయంగా ఉచిత టిక్కెట్లను పంపిణీ చేస్తూ, వారితో సరదాగా ముచ్చటించారు.
సీఎం విజయ్‌కు తమ సంతోషాన్ని తెలుపుతూ విద్యార్థినులు డైరీ మిల్క్ చాక్లెట్లను బహుమతిగా ఇవ్వగా, ఆయన వాటిని చిరునవ్వుతో స్వీకరించి తన జేబులో దాచుకున్నారు. ఈ ఉచిత ప్రయాణ పథకం విస్తరణ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 84 లక్షల మంది మహిళలకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.
Also Read : మిజోరంలో విషాదం: ఐఐఎస్ అధికారులు మృతి
Follow Us On: Youtube

