మిజోరంలో విషాదం: ఐఐఎస్ అధికారులు మృతి

కలం, వెబ్ డెస్క్ : మిజోరం రాజధాని ఐజ్వాల్ సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం (Mizoram Accident)లో ముగ్గురు ప్రభుత్వ సమాచార శాఖ అధికారులు మరణించారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడంతో ఈ దారుణం జరిగింది.

ఈ ప్రమాదంలో ఇంఫాల్ PIB అదనపు డైరెక్టర్ జనరల్ (ADG) డాక్టర్ ఎంగమ్ పామే, మిజోరం దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ DPR ప్రధాన కార్యాలయంలో PRO డిఫెన్స్‌గా పనిచేసిన నాంపిబో మారన్మై, అలాగే మరో ప్రభుత్వ అధికారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘోర ప్రమాదంపై రక్షణ మంత్రిత్వ శాఖతో పాటు దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ జనరల్ మమతా వర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారు అందించిన సేవలను, ముఖ్యంగా డిఫెన్స్ విభాగానికి చెందిన వార్తా సేకరణలో వారు చూపిన ప్రతిభను అధికారులు కొనియాడారు.

Also Read : ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>