గాంధీ జయంతి సందర్భంగా కలెక్టర్‌ ఘన నివాళులు

కలం, కరీంనగర్: గాంధీ జయంతిని (Gandhi Jayanti) పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్‌ చిత్ర మిశ్ర గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ సేవలను స్మరించుకున్నారు.

సత్యం, అహింస, శాంతి మార్గాల్లో గాంధీజీ చూపిన బాటను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడేతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని గాంధీజీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ ప్రాంగణంలో గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>