కలం, వెబ్ డెస్క్: ‘సంక్రాంతికి వస్తున్నం’ సూపర్ సక్సెస్ తర్వాత విక్టరీ వెంకటేశ్ (Venkatesh) కొంత గ్యాప్ బ్రేక్ తీసుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే ఎంటర్టైనర్ సినిమా షూటింగ్‌ను ఆయన పూర్తి చేసుకున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ 20 నిమిషాల పాటు అతిథి పాత్రలో కనిపిస్తాడు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్‌ను వెంకటేశ్ ఇటీవలే ప్రారంభించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. మార్చి నాటికి షూటింగ్ పూర్తి చేయాలని వెంకటేశ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక దృశ్యం3 తెలుగు వెర్షన్‌లో కూడా వెంకటేశ్ ప్రధాన నటుడు. మలయాళ వెర్షన్ ప్రస్తుతం షూటింగ్ (Shooting) జరుగుతోంది. వెంకీ డేట్స్ కేటాయించిన తర్వాత తెలుగు షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది దృశ్యం 3 సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విడుదల తేదీ ప్రకటన త్వరలో వస్తుంది. మొత్తం మీద వెంకటేశ్ (Venkatesh) 2026లో మూడు సినిమాలతో సందడి చేయనున్నాడు.
Read Also: పూరి, విజయ్ సేతుపతి మూవీ ఏమైంది..?
Follow Us On: X(Twitter)


