కలం, వెబ్ డెస్క్: సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు తెలంగాణలోని కొండగట్టు (Kondagattu) అంటే ప్రత్యేకమైన సెంటిమెంట్. ఆయనకు ఏమాత్రం సమయం దొరికినా ఈ ప్రముఖ క్షేత్రానికి వచ్చి పూజలు చేస్తుంటారు. శనివారం ఆయన కొండగట్టుకు రానున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో భక్తుల కోసం నిర్మించనున్న పలు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
రూ. 35.19 కోట్ల అంచనాతో ఒకేసారి 2,000 మంది భక్తులకు వసతి కల్పించడానికి, తీర్థయాత్రల సమయంలో రద్దీని తగ్గించడానికి గదులను నిర్మించనున్నారు. దీక్ష విరమణ మండపంతోపాటు 96 గదుల సత్రాల పనులు ప్రారంభంకానున్నాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమం ఉదయం 10.30 నుండి 11.30 గంటల మధ్య జరగనుంది.
కొండగట్టు పర్యటన తర్వాత పవన్ తెలంగాణకు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. ఇటీవల తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో సంభాషిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విజయం తర్వాత పవన్ కళ్యాణ్ గతంలో ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆలయ అధికారులు, పూజారులతో మాట్లాడారు. పైసమస్యలను పవన్ (Pawan Kalyan) దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై ఆయన ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుతో చర్చించి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో చర్చలు జరిపారు. తరువాత టీటీడీ బోర్డు ఈ ప్రాజెక్టుకు నిధులను ఆమోదించింది.
Read Also: పూరి, విజయ్ సేతుపతి మూవీ ఏమైంది..?
Follow Us On: Sharechat


