నిర్మల్ అభివృద్ధి పనులపై ఎంపీ గోడం నగేష్‌కు బీజేపీ కౌన్సిలర్ల వినతి

కలం, నిర్మల్: ఎంపీ గోడం నగేష్‌ (MP Godam Nagesh) ను నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ బీజేపీ కౌన్సిలర్లు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి నిధులు మంజూరు చేయాలని కోరారు. కౌన్సిలర్ల వినతిపై స్పందించిన ఎంపీ.. త్వరలోనే నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజు నరేష్, కూన శశాంక్, జింక సూరి, రావులవారి విఠల్, సూరజ్ నాయక్, నాయకులు ఒడిసెల అర్జున్, ధర్మాజీగారి ఈశ్వర్, వెంకటేష్, పూదరి రంజిత్, కందుల హరీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>