కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు దిగజారిపోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఫైర్ అయ్యారు. చివరికి దేవుళ్లపై కూడా రాజకీయాలు చేస్తూ.. రాములు, శివుడు వేర్వేరు అంటూ హిందువుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. మతాల పేరిట ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా కాంగ్రెస్ వ్యవహారం ఉందన్నారు.
హిందూ దేవుళ్లపై మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఇతర మతాల గురించి మాట్లాడే దమ్ము ఉందా..? అని సవాల్ చేశారు. గతంలో కేసీఆర్ (KCR) కూడా ఇలాగే హిందూ గాళ్లు.. బొందు గాళ్లు అంటూ ఇష్టారీతిన మాట్లాడారని.. రేవంత్ రెడ్డి కూడా అలాగే వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలకు 129 ఎంపీ సీట్ల నుంచి 190 సీట్లకు పెంచుకుందామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే.. కాంగ్రెస్ మొండిపట్టుతో అంగీకరించడం లేదన్నారు.
గాంధీ కుటుంబానికే హక్కు ఉందా..?
ఈ దేశాన్ని పాలించే గాంధీ కుటుంబానికే ఉందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) భావిస్తుంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. 12 ఏళ్లు పాలించిన మోదీపై ఎందుకు వ్యతిరేకత రావడం లేదని రాహుల్ అసహనం వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మోదీ వరుసగా గెలవడానికి ఎన్డీయే పనితీరు కారణమైతే.. కాంగ్రెస్ వరుసగా ఓడిపోవడానికి మాత్రం రాహుల్ గాంధీనే కారణమన్నారు. ఈవీఎంల్లో తప్పులు, ఓట్ చోరీ.. అంటూ పసలేని ఆరోపణలు చేస్తుంటారని విమర్శించారు. రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో ప్రతిపక్ష నేత హోదా కూడా పొందలేరని కూడా జోస్యం చెప్పారు.
Also Read : రష్యా ఆర్మీలోకి భారతీయులు.. కేంద్రం హెచ్చరిక!
Follow Us On: X(Twitter)

