ప్రేమ జంట విషాదాంతం.. చెరువులో దూకి యువకుడు, బాలిక ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్ : గుంటూరు (Guntur) జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఓయువకుడు, పదో తరగతి చదువుతున్న బాలిక కలిసి ఆత్మహత్య (suicide) చేసుకున్న ఘటన బాపట్ల జిల్లా పరిధిలో వెలుగుచూసింది. మృతులు గుంటూరు జిల్లా కాకుమాను మండలానికి చెందిన విఘ్నేష్‌ (22), 15 ఏళ్ల బాలికగా పోలీసులు గుర్తించారు.

కాకుమాను మండల కేంద్రంలో తాత, అమ్మమ్మ వద్ద ఉంటూ బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమె చదువుతున్న పాఠశాల బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు విఘ్నేష్‌. ఇంటర్‌ పూర్తి చేసిన అతడు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నట్లు సమాచారం. తండ్రి కోసం తరచూ పాఠశాల వద్దకు వెళ్లే క్రమంలో బాలికతో విఘ్నేష్‌కు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారినట్లు సమాచారం.

బంధువులకు ఫోన్ చేసి..

ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. బుధవారం బాపట్ల జిల్లా కోనంకి గ్రామ చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి బంధువులకు ఫోన్‌ చేసి తాము ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ఎలుకల మందు తీసుకుని చెరువులో దూకినట్లు సమాచారం.

చెరువులో మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడు, బాలిక ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, వారి మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>