బీసీ జేఏసీ బంద్‌కు(BC Bandh) అన్ని పార్టీల వారు సంపూర్ణ మద్దతు తెలిపారు. శనివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన బంద్‌లో అన్ని పార్టీల నేతలు కూడా పాల్గొంటున్నారు. ఇందులో బాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు(Hanumantha Rao) కూడా బీసీ ర్యాలీలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ చట్ట బద్దంగా కల్పించాలని డిమాండ్ చేస్తున్న బ్యానర్‌ను పట్టుకుని ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. కాగా, ఈ క్రమంలో బ్యానర్ కాలికి అడ్డు పడటంతో ఆయన కిందపడిపోయారు. వెంటనే స్పందించిన మిగిలిన నేతలు ఆయనను పైకి లేపారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ వారితో కలిసి పాల్గొన్నాయి.
Read Also: బీసీ బంద్‌లో కవిత కుమారుడు..

