సర్ కు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ధర్నా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : దేశవ్యాప్తంగా అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అక్టోబర్ 1న సర్ కు వ్యతిరేకంగా మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించాలని సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా పార్టీల జిల్లా కార్యదర్శులు ఏ.రాములు (సిపిఎం), బాల కిషన్(సిపిఐ), సిహెచ్ రామచందర్ బుధవారం రోజు సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్​ ను లొంగదీసుకుని సర్ పేరుతో ఓట్లను తొలగించి ఎన్నికల్లో గెలుస్తున్నదని ఆరోపించారు.

ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్ కుమార్ (Gyanesh Kumar) తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. పాత పద్ధతిలోనే ఎలక్షన్ కమిషన్ కొనసాగించాలని, సర్ ను ఎత్తివేయాలన్నారు. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ల తెర వెనుక నాటకం బహిరంగ పరిచిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్టు రీతిక చోప్రా ధైర్య సాహసాలను నాయకులు అభినందించారు. గురువారం జరిగే ధర్నాకు వామపక్ష, సెక్యులర్ పార్టీలు, ప్రజాసంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు కిళ్ళే గోపాల్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లవెల్లి కురుమూర్తి, రాజ్ కుమార్, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : నాగల్ జోరు.. సురేశ్ ఔట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>