కలం, స్పోర్ట్స్ : ఆసియా క్రీడల్లో (Asian Games) భారత టెన్నిస్‌కు మిశ్రమ ఫలితం ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నాగల్ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సెర్గీ ఫోమిన్‌పై 6-3, 6-2తో వరుస సెట్లలో గెలిచాడు. మ్యాచ్ ఆరంభం నుంచే నాగల్ నియంత్రణతో ఆడాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా మ్యాచ్‌ను ముగించాడు. ఇక క్వార్టర్‌ఫైనల్లో నాగల్‌కు గట్టి సవాల్ ఎదురుకానుంది.
చైనాకు చెందిన మూడో సీడ్ వు యిబింగ్‌తో తలపడనున్నాడు. మరోవైపు ధక్షిణేశ్వర్ సురేశ్ సింగిల్స్ ప్రయాణం ముగిసింది. చైనీస్ తైపీకి చెందిన ఆరో సీడ్ చున్-హ్సిన్ సెంగ్ చేతిలో 3-6, 4-6తో ఓడిపోయాడు. సురేశ్ రెండో రౌండ్‌లో ఇండోనేషియాకు చెందిన గునావన్ త్రిస్మువంతరాపై 7-5, 7-6తో గెలిచి మూడో రౌండ్ చేరాడు. అయితే మూడో రౌండ్‌లో ఆ జోరును కొనసాగించలేకపోయాడు.

