కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల బహిరంగ సభా వేదికగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో కేసీఆర్ రూ.లక్ష కోట్లు కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి ఏ పని చేస్తే రూ. లక్ష కోట్లు వచ్చాయో చెప్పాలని నిలదీశారు. ఆయన సడ్డకుడి కొడుకు సంతోష్ రావు మానేరు ఇసుక కొల్లగొట్టారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ (KTR) తో కలిసి రూ. వేల కోట్లు దోపిడీ చేసింది నిజం కదా? అని ప్రశ్నించారు.
లారీలతో తొక్కించింది నిజం కాదా?
నేరెళ్ల ఘటనలో దళితులను లారీలతో తొక్కించింది నిజం కాదా? అని నిలదీశారు. దళిత బిడ్డల్ని పోలీస్ స్టేషన్ లో చిత్ర హింసలు పెట్టలేదా? అని ఫైర్ అయ్యారు. పాలమూరు జిల్లాలో కేసీఆర్ ను గెలిపించినా అక్కడ మార్పు రాలేదని మండిపడ్డారు. తండ్రి కొడుకులను గెలిపిస్తే రూ. లక్ష కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. అమెరికాలో ఎన్ని చిప్పలు కడిగితే రూ.లక్షల కోట్లు వస్తాయని రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..
బహిరంగ సభావేదికగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సిరిసిల్లలో నూతనంగా మంజూరైన నేత బజారు, రూ.5 కోట్లతో పెద్దూరులో నిర్మించనున్న ఇందిరా మహిళా శక్తి భవన్, రూ.15 కోట్లతో రెండు ఆర్దీవోలు, 4 తహశీల్దార్ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.16 కోట్లతో కొనరావుపేట, సిరిసిల్లలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణం, రూ.99 కోట్లతో వేములవాడ ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. రూ.200 కోట్లతో సిరిసిల్లలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.10 కోట్లతో రుద్రంగిలో 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాము నిర్మాణాన్ని ప్రారంభించారు.
Also Read : బీఆర్ఎస్ పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల : సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

