కుస్తీలో భారత్‌కు తొలి పతకం.. సునీల్ కాంస్యం

కలం, స్పోర్ట్స్​ : ఆసియా గేమ్స్ (Asian Games 2026) లో భారత రెజ్లింగ్ జట్టు పతకాల ఖాతాను తెరిచింది. బుధవారం జరిగిన పురుషుల గ్రీకో-రోమన్ 87 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సునీల్ కుమార్ (Sunil Kumar) అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. సెమీఫైనల్‌లో జపాన్‌కు చెందిన తైజో యోషిడా చేతిలో ఓటమి పాలైన హర్యానాకు చెందిన 27 ఏళ్ల సునీల్ కుమార్, ఆ తర్వాత కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. కాంస్య పతక పోరులో ఫిలిప్పీన్స్ ఆటగాడు కాలమ్ జాన్‌స్టన్ రాబర్ట్స్ పై ఆరంభం నుంచే సునీల్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.

ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా, టెక్నికల్ సుపీరియారిటీ విధానంలో 9-0 తేడాతో సునీల్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయంతో సునీల్ కుమార్ గ్రీకో-రోమన్ విభాగంలో భారతదేశ సుదీర్ఘ నిరీక్షణకు మళ్లీ ప్రాణం పోశారు. గతంలో 2010 గ్వాంగ్‌జౌ ఆసియా గేమ్స్‌ (Asian Games) లో రవీందర్ సింగ్, సునీల్ కుమార్ రాణా కాంస్యాలు గెలవగా, ఆ తర్వాత 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2023 హాంజౌ క్రీడల్లోనూ సునీల్ కాంస్యం గెలుచుకున్నారు. ఈసారి కూడా అదే విభాగంలో మెరిసి భారత్ క్రీడా ప్రతిష్ఠను నిలబెట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>