కలం, వెబ్ డెస్క్ : కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో మూడు కీలక నిర్ణయాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంటల మద్ధతు ధర పెంపునకు (MSP Hike) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోధుమలు, పప్పు ధాన్యాలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోధుమలకు రూ.2,610, శెనగలకు రూ.5,958, ఎర్ర కందిపప్పు రూ.7,390, బార్లీ రూ.2,286కు, ఆవాలు రూ.6,613, పొద్దుతిరుగుడు కు మద్దతు ధర రూ.7,215కు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే, ఢిల్లీలో ITMSకు రూ.1,790 కోట్లు కేటాయించింది.

