ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. టైరు పేలి బోల్తాపడిన డీసీఎం

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే (Delhi-Meerut Expressway) పై ఘజియాబాద్‌లోని వేవ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో టైరు పేలి ఒక డీసీఎం వాహనం బోల్తా పడింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. చేపల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ వేగంగా వెళ్తుండగా అకస్మాత్తుగా టైరు పేలిపోయింది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డు డివైఢర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ సమయంలో వెనుక నుంచి వస్తున్న ఒక కార్ కూడా బోల్తాపడిన వాహనాన్ని ఢీకొట్టింది.

డీసీఎం బోల్తా పడడంతో లోపల ఉన్న చేపలన్నీ ఎక్స్ ప్రెస్‌వేపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ మార్గంలో వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న వేవ్ సిటీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్రేన్ సహాయంతో బోల్తా పడిన వాహనాన్ని రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>