‘సుందర్ పిచాయ్ ఓ రాక్షసుడు’.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌ (Sundar Pichai) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో టెక్ దిగ్గజాలతో జరిగిన సమావేశం అనంతరం సరదా సంభాషణలో పిచాయ్‌ను ‘రాక్షసుడు’గా (Monster) అభివర్ణించారు. అయితే ఇది ప్రతికూల వ్యాఖ్య కాదని, టెక్ రంగంలో ఆయన ప్రభావాన్ని ప్రశంసిస్తూ ట్రంప్ హాస్యభరితంగా చేసిన వ్యాఖ్యగా పలు నివేదికలు పేర్కొన్నాయి.

AI భద్రతపై టెక్ దిగ్గజాలతో చర్చ

కృత్రిమ మేధ (AI) భద్రత, పర్యవేక్షణ, సాంకేతిక అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ట్రంప్ (Donald Trump) వైట్‌హౌస్‌లో ప్రముఖ టెక్ కంపెనీల అధిపతులతో సమావేశమయ్యారు. ఇందులో సుందర్ పిచాయ్‌తో పాటు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ తదితరులు పాల్గొన్నారు. AI అభివృద్ధిలో భద్రతా ప్రమాణాలు, అంతర్గత నియంత్రణలు, స్వతంత్ర ఆడిటింగ్ వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది.

‘ఎవరికి తెలియని రాక్షసుడు’ అంటూ ప్రశంస

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ .. సుందర్ పిచాయ్‌ను ఉద్దేశించి ‘ఈ వ్యక్తి ఓ రాక్షసుడు.. ఆయన గురించి ఎవరికీ తెలియదు’ అంటూ వ్యాఖ్యానించారు. టెక్ రంగంలో పిచాయ్‌కు ఉన్న ప్రభావాన్ని ప్రస్తావిస్తూ ఆయన ప్రశంసలు కురిపించారు. గతంలోనూ ప్రపంచంలోని అత్యంత కీలక వ్యక్తుల్లో పిచాయ్ ఒకరని ట్రంప్ పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ట్రంప్ వ్యాఖ్యలపై పిచాయ్ కూడా సరదాగా స్పందిస్తూ.. ‘నేను రాక్షసుడిననే దానికంటే మంచి ట్యాగ్‌లైన్ ఉంటుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>