నిర్మల్​ సుబ్రహ్మణ్యస్వామి సన్నిధిలో పృథ్వి సాయిచరణ్ పూజలు

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కమెడియన్ పృథ్వి సాయిచరణ్ (Comedian Prithvi Sai Charan) మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి దర్శనం కోసం నిర్మల్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం విశేషమని అన్నారు. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో భక్తులందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి కొద్దిసేపు గడిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>