కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో టీఎస్‌ఎస్ – పీఎం శ్రీ సమగ్ర విద్యపై ఇండక్షన్ ప్రోగ్రామ్‌ను మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి భోజన్న మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిని కలుపుకొని పోవడమే సమగ్ర విద్య లక్ష్యమన్నారు. దివ్యాంగ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, సహానుభూతితో విద్యను అందించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించేలా ఉపాధ్యాయులు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ అర్బన్ ఎంఈఓ పద్మ, జిల్లా విలీన విద్య సమన్వయకర్త ఎన్. ప్రవీణ్ కుమార్, ఆర్‌పీ దయానంద్, సీఆర్‌పీలు, ఎంఐఎస్ సీఓలు, సీసీఓలు, నాన్ టీచింగ్ సిబ్బంది, సమగ్ర శిక్షా అధికారులు పాల్గొన్నారు.

