తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వండి: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు(Tummidihatti Project)కు త్వరగా అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. ఈ మేరకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలో సీఆర్ పాటిల్‌ను కలిసి రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల వద్దనే నిర్మించుకునేలా మహారాష్ట్రను ఒప్పించి పర్యావరణ అనుమతులు ఇవ్వాలన్నారు.

సమ్మక్క సారక్క సాగర్‌కు పెండింగ్ అనుమతులను వెంటనే మంజూరు చేయాలన్నారు. పాలమూరు రంగారెడ్డి, డిండి, సీతారామ ప్రాజెక్టులు, గౌరవెల్లి రిజర్వాయర్‌కు సంబంధించిన పర్యావరణ అనుమతులు త్వరగా జారీ అయ్యేలా మంత్రిత్వ శాఖ నుంచి చొరవ తీసుకోవాలని విన్నవించారు. కేఆర్ఎంబీ టెలిమెట్రీలు కూడా త్వరగా అమర్చేలా చూడాలని వివరించారు.

Also Read : శ్రీ చరణి సరికొత్త ప్రపంచ రికార్డు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>