కలం, కరీంనగర్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళపై చేసిన “పేదోళ్లకు శివుడు.. ఉన్నోళ్లకు రాముడు.. అందుకే బీజేపీ వాళ్లు పదే పదే ‘జై శ్రీరామ్’ అంటారు” అని చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు (BJP Protests) నిర్వహించింది. మండల కేంద్రాల్లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిష్టిబొమ్మను పార్టీ నాయకులు దహనం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాసరావు (Gujja Srinivasa Rao) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మతిభ్రమించిందని అన్నారు. అందుకే హిందూ దేవుళ్ళ గురించి, దేవుళ్ళ మధ్య విభేదాలు సృష్టించే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేవుళ్ళలో పేద దేవుడు, ధనిక దేవుడు ఉండరనే విషయాన్ని అజ్ఞాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు గ్రహించాలన్నారు. కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని మాట్లాడడమే కాకుండా తన పేరును రేవంత్ఉద్దీన్ గా ప్రకటించుకున్న రేవంత్ రెడ్డికి ముందుగా హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
కేవలం ముస్లింల ఓట్ల కోసం, మెప్పు కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం దేవుళ్ళ పేరిట రాజకీయం చేస్తున్నారని శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. శైవ, వైష్ణవ దేవుళ్ళ మధ్య అడ్డుగోడ పెట్టి, హిందూ సమాజాన్ని విభజించాలనే దురాలోచనతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. హిందూ దేవుళ్ళతో పెట్టుకున్న ఏ ఒక్కరూ రాజకీయంగా మనగడ సాధించలేదని అన్నారు. దేవుళ్ళ పేరిట రాజకీయాలు చేస్తే దైవ ఆగ్రహానికి గురికాక తప్పదని, త్వరలో దైవమే ఆయనకు తగిన గుణపాఠం చెప్తుందన్నారు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుని, హిందూ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బత్తుల లక్ష్మినారాయణ, యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి, బీజేవైయం జిల్లా అధ్యక్షుడు సంగ నరేష్, బీజేపీ జోన్ – మండలాల అధ్యక్షులు జాడి బాల్ రెడ్డి, మాడిశెట్టి సంతోష్, కుంట తిరుపతి, బండారి గాయత్రి, కార్పోరేటర్లు బండారి వేణు, మ్యాకల వెంకటేష్, భూపతి రవీందర్, చొప్పరి జయశ్రీ, పెద్దపెల్లి శ్రీలేఖ-జితేందర్, మొండయ్య, నాంపల్లి శ్రీనివాస్, నాయకులు వైద రామానుజం, ఉప్పు రాంకిషన్, జగీశ్వర చారి, కచ్చకాయల రాజు, కడార్ల విమల్, వినీత్, సదానందం నాయక్, అజయ్, నక్క ప్రమోద్, కిరణ్ రెడ్డి, ఎల్కపెల్లి రమేష్, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : శ్రీ చరణి సరికొత్త ప్రపంచ రికార్డు!
Follow Us On: X(Twitter)

