శ్రీ చరణి సరికొత్త ప్రపంచ రికార్డు!

కలం, స్పోర్ట్స్​ : ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి (Sri Charani) సరికొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె ఏకంగా 817 రేటింగ్ పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా బౌలర్ మెగాన్ షుట్ నెలకొల్పిన 806 పాయింట్ల రికార్డును శ్రీ చరణి చెరిపివేసింది. ఐసీసీ టీ20 బౌలింగ్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్‌గా కొత్త చరిత్ర లిఖించిన శ్రీ చరణి.

ఆసియా క్రీడల ఫైనల్లో శ్రీలంకపై శ్రీ చరణి 13 పరుగులకే 2 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ 147 పరుగుల భారీ తేడాతో గెలిచి పసిడి పతకం కైవసం చేసుకుంది. టోర్నీ పొడవునా శ్రీచరణి కనబరిచిన స్థిరమైన ప్రదర్శనే ఐసీసీ ఆల్‌టైమ్ రికార్డు సాధించడానికి కారణమైంది. శ్రీ చరణితో పాటు ఇతర భారత బ్యాటర్లు కూడా తమ ర్యాంకింగ్స్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్నారు.

ఫైనల్లో 79 పరుగులతో రాణించిన స్మృతి మంధాన ఒక స్థానం ఎగబాకి మళ్లీ టాప్-5లోకి చేరింది. అలాగే మెరుపు ఇన్నింగ్స్‌తో 49 పరుగులు చేసిన రిచా ఘోష్ మూడు స్థానాలు మెరుగై 25వ ర్యాంకుకు చేరుకుంది. ఇతర జట్ల విషయానికొస్తే పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా, బంగ్లాదేశ్ బ్యాటర్ షార్మిన్ అక్తర్, పాకిస్థాన్ బౌలర్ ఉమ్మే హానీ కూడా ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలను సాధించారు.

మరోవైపు వన్డే ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ జింబాబ్వేపై 182 పరుగుల కెరీర్ బెస్ట్ స్కోరుతో నాల్గో స్థానానికి చేరుకుంది. జింబాబ్వే కెప్టెన్ మోడెస్టర్ ముపాచిక్వా 16 స్థానాలు ఎగబాకి 40వ ర్యాంక్ సాధించారు. ఆసియా క్రీడలు, వన్డే సిరీస్ ఫలితాలు ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అంతర్జాతీయ వేదికలపై ఆటగాళ్లు చూపిస్తున్న ప్రతిభ మహిళా క్రికెట్ ప్రమాణాలను మరింత పెంచుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>