కలం, వెబ్ డెస్క్: మోదీ ప్రభుత్వాన్ని బ్రిటీష్ పాలనతో పోల్చడం హేయనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలా పోల్చడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అపహస్యం చేయడమేనని ఫైర్ అయ్యారు. మోదీని ఎదుర్కొనే దమ్ములేక ఈసీపై, ఈవీఎంలపై నిందలేస్తారా? అంటూ నిలదీశారు. కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచినప్పుడు సీడబ్ల్యూసీకి ఈవీఎంలు గుర్తుకు రాలేదా? అంటూ ప్రశ్నించారు. సర్ ప్రకియవల్లే గెలిచామని కేరళ కాంగ్రెస్ నేతలు ప్రకటించిన విషయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మర్చిపోయిందా? అని అడిగారు.
ప్రధాని మోదీ ఎందుకు రాజీనామా చేయాలో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. దేశ ప్రజలు అప్రతిహతంగా 3సార్లు వరుసగా గెలిపించినందుకు రాజీనామా చేయాలా? అని అడిగారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనాన్ని, భారతీయుల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నందుకు రాజీనామా చేయాలా? అని మండిపడ్డారు.
సర్ ప్రకియ సిబ్బంది అంతా రాష్ట్ర ప్రభుత్వ అధికారులేనని..సర్ లో పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునే వ్యవస్థ ఉందని బండి సంజయ్ తెలిపారు. సర్ ప్రకియలో పొరపాట్లను కేంద్రంపై నెపం నెట్టడం దుర్మార్గమని తెలిపారు.ఇటలీ మూలాలున్న కాంగ్రెస్ నేతలకు భారత ప్రజాస్వామ్యమంటే చులకన అంటూ మండిపడ్డారు. SIR కొత్త ప్రక్రియ కానేకాదని.. గతంలోనూ సర్ ప్రక్రియను కొనసాగించారని తెలిపారు.
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సర్ ప్రక్రియను సమర్ధించిందని పేర్కొన్నారు. అనర్హుడైన వాళ్లు ఓటర్ జాబితాలో ఉండకూడదన్నదే సర్ ఉద్దేశమని స్పష్టం చేశారు. సర్ ప్రక్రియతో ఎన్నికల సంఘం చేసిన తప్పేంటి? అని ప్రశ్నంచిన బండి సంజయ్.. ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

