దక్షిణ భారత చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి : ఎంజీయూ వీసీ

కలం, నల్లగొండ: దక్షిణ భారతదేశానికి చెందిన ఘనమైన చరిత్ర, సంస్కృతులు, సాంప్రదాయక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమ్మేళనం (South Indian History Congress) నిలవాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్​లర్​ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన “45వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సెషన్” ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు.

అనంతరం స్థానిక సెక్రటరీ ఆధ్వర్యంలో రూపొందించిన వివరాలతో కూడిన బ్రోచర్, సర్క్యులర్‌ను కమిటీ సభ్యులతో కలిసి ఉపకులపతి మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఈ హిస్టరీ కాంగ్రెస్ ద్వారా ఎన్నో ప్రాచీన, విలువైన చారిత్రక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. దేశ నలుమూలల నుండి ప్రముఖ చరిత్రకారులు, పరిశోధకులు, మేధావులు ఈ సమ్మేళనానికి విశేష సంఖ్యలో హాజరయ్యేలా ఘనంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణప్రియ, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ హరీష్ కుమార్, ఆచార్య వసంత, ఆచార్య రఘురామారావు, డాక్టర్ వై. ప్రశాంతి, ఆచార్య అలువాలా రవి, ఆచార్య శ్రీనివాస్, చరిత్ర విభాగ అధ్యాపకులు ఆచార్య విజయబాబు, డాక్టర్ పనస రామకృష్ణ, డాక్టర్ షరీఫ్, డాక్టర్ శ్రీనివాస్, వివేక్, డాక్టర్ జక్కా సురేష్ రెడ్డి, డాక్టర్ హైమావతి, డాక్టర్ శివరాం, డాక్టర్ సబినా హెరాల్డ్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>