కలం, వెబ్‌డెస్క్: షిర్డీలోని సాయి బాబా (Shirdi Sai Baba) సంస్థాన్‌కు ఓ భక్తుడు వజ్రాల కిరీటం బహూకరించాడు. న్యూయర్ సందర్భంగా గురువారం రాత్రి ఆలయానికి వచ్చిన ఫరీదాబాద్ నివాసి ప్రదీప్ మొహంతి అనే భక్తుడు ఈ అపురూప కానుక ఇచ్చాడు. వజ్రాలు పొదిగిన ఈ బంగారు కిరీటం విలువ రూ.80లక్షలు ఉంటుందని సంస్థాన్ సీఈవో గోరక్ష్ గడేల్కర్ (Goraksh Gadilkar) తెలిపారు. 585 గ్రాముల బంగారు, 153 వజ్రాల(24 క్యారెట్ల)తో తయారుచేసిన ఈ కిరీటం బరువు 655 గ్రాములు ఉన్నట్లు చెప్పారు. భక్తుని సమక్షంలో ఈ కిరీటాన్ని కొద్దిసేపు సాయిబాబా విగ్రహంపై అలంకరించారు. ప్రదీప్ మొహంతి, అతని భార్య ప్రతిమ మొహంతిని ట్రస్ట్ అధికారులు సత్కరించారు.
Read Also: మనం చీరలు కడుతాం.. మనది గొప్ప కల్చర్ : నటి రోహిణి
Follow Us On: Pinterest


