కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ, వారి దురాక్రమణలను ఖండించకుండా దేశ శాంతి సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ (CPI ML Massline) రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు (Potu Rangarao) తీవ్రంగా విమర్శించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో భగత్ సింగ్ 119వ జయంతిని పురస్కరించుకుని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్, దాని అనుబంధ సంఘాలైన పీడబ్ల్యూఏ, పీడీఎస్‌యూ, పీవైఎల్, టీయూసీఐల ఆధ్వర్యంలో కాగడాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా పోటు రంగారావు (Potu Rangarao) మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సార్వభౌమత్వం కోసం పాలస్తీనా, క్యూబా ప్రజలు చేస్తున్న పోరాటాలకు భగత్ సింగ్ స్ఫూర్తితో భారత ప్రజలు పూర్తి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, చంద్ర అరుణలు మాట్లాడుతూ.. వలస ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుండి నడిపించినందుకే బ్రిటీష్ వలసవాదులు భగత్ సింగ్‌ను ఉరితీశారని పేర్కొన్నారు. తొమ్మిది కోట్ల జనాభా ఉన్న ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దురాక్రమణను గానీ, పాలస్తీనాలో లక్ష మందికి పైగా బలితీసుకున్న నరమేధాన్ని గానీ ఖండించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
Also Read : గుజరాత్లో గేమ్స్ జాతర.. 76 లక్షల రిజిస్ట్రేషన్లు!
Follow Us On: X(Twitter)

