ఖమ్మంలో ఘనంగా AIKMS 4వ జాతీయ మహాసభలు

కలం, ఖమ్మం బ్యూరో: అఖిల భారత కిసాన్ మజ్దూర్ సభ (AIKMS) 4వ జాతీయ మహాసభల సందర్భంగా ఖమ్మం పురవీధులు సోమవారం ఎరుపుమయమయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒరిస్సా, బీహార్, పంజాబ్, బెంగాల్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వేలాది మంది రైతుకూలీలు, ప్రతినిధులు ఎర్రజెండాలు చేతబూని భారీ ప్రదర్శన నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ నుండి ప్రారంభమైన ఈ ప్రదర్శన కోలాటం, డప్పు, కొమ్ము కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ మయూరి సెంటర్, అంబేద్కర్ సెంటర్ మీదుగా ఎస్ఆర్&బిజిఎన్ఆర్ కళాశాల సభా ప్రాంగణానికి చేరుకుంది.

​అనంతరం జరిగిన బహిరంగ సభలో AIKMS జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశిష్ మిట్టల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య, కార్పొరేట్ అనుకూల వ్యవసాయ విధానాలు తీవ్ర ప్రమాదకరమని హెచ్చరించారు. రైతుల ఆందోళనతో నల్లచట్టాలను ఉపసంహరించుకున్నప్పటికీ, కార్పొరేట్ శక్తులకు భూములను అప్పగించే కుట్రలు మళ్లీ సాగుతున్నాయని మండిపడ్డారు.

విద్యుత్ ఛార్జీల పెంపు, కాంట్రాక్ట్ మోడల్, జీరో బడ్జెట్ సాగు వంటి విధానాలు తీవ్రంగా విఫలమయ్యాయని విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర (MSP) కల్పించాలని, గిరిజనులు, ఆదివాసీల భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ తరహాలోనే ఈ స్వేచ్ఛా వాణిజ్య విధానాలపై కూడా దేశవ్యాప్త ఐక్య పోరాటాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు. జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలు రాష్ట్రాల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Also Read : SIR గో బ్యాక్ నినాదంతో ఉద్యమిస్తాం : సీఎం రేవంత్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>