పోలీస్ ఉద్యోగార్థులకు మధ్యాహ్న భోజనం

కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ (Adilabad) పట్టణంలో బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్‌లో కానిస్టేబుల్, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాల కోసం ఎంపికైన 200 మంది అభ్యర్థులకు 60 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. శిక్షణ పొందుతున్న అభ్యర్థుల సౌకర్యార్థం ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు ఉచిత అన్నప్రసాద సేవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఉచితంగా పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఇస్కాన్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కష్టపడి చదివి, అందుబాటులో ఉన్న శిక్షణ, వసతులను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.

అనంతరం కలెక్టర్ స్వయంగా అభ్యర్థులకు భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధి ప్రణవ నంద ప్రభుజీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి సోనియా, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్, శిక్షణార్థులు, అధికారులు, పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>