మోడీ, అమిత్ షా కనుసన్నల్లోనే ఈసీ.. పెద్దపల్లిలో విజయరమణారావు ఫైర్

కలం, ​పెద్దపల్లి: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాల కనుసన్నల్లోనే ఎన్నికల కమిషన్ నడుస్తోందని, ఎస్‌ఐఆర్ (SIR) పేరుతో తమకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో కుట్రపూరితంగా ఓట్లను తొలగిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
​
ఎన్నికల కమిషన్ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ (Peddapalli Collectorate) ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా (Congress Protest) నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల కమిషనర్ గణేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయన వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ తీరుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పలుమార్లు ప్రశ్నించినా ఈసీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు. SIR ప్రక్రియ వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది పౌరుల ఓటు హక్కు గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం ప్రజలకు సమగ్ర వివరణ ఇవ్వాలని, పారదర్శకతను కాపాడలేకపోతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ గణేష్ కుమార్ తక్షణమే తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంచాలని, రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఓటు హక్కు రక్షణ కోసం ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులందరూ గళం విప్పాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>