కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఇంటర్ మీడియట్ బోర్డు (Inter Board) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లను ఇక నుంచి విద్యార్థుల పేరెంట్స్ వాట్సాప్ (WhatsApp) కు పంపించనున్నట్టు తెలిపింది. ఫిబ్రవరి 25 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి.. 45 రోజుల ముందే ఈ హాల్ టికెట్లను పంపించబోతున్నారు. అలా పంపిస్తే హాల్ టికెట్లలో ఏదైనా మిస్టేక్ ఉంటే ముందే గుర్తించే ఛాన్స్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
స్టూడెంట్లు, పేరెంట్స్ హాల్ టికెట్లను క్లియర్ గా చూసుకుని.. ఏమైనా మిస్టేక్స్ సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇంటర్ బోర్డు (Inter Board) స్పష్టం చేసింది. స్టూడెంట్లకు ఎగ్జామ్ గురించి ఫుల్ డీటేయిల్స్ క్లియర్ గా చెప్పడమే తమ ఉద్దేశం అని వివరించింది ఇంటర్ బోర్డు. ప్రస్తుతం అందరు పేరెంట్స్ దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
Read Also: మహాత్మా.. కనికరించవా? : ఎంజీయూలో అధ్యాపకుల కొరత
Follow Us On : WhatsApp


