జమ్మికుంట డిగ్రీ కాలేజీలో భగత్ సింగ్ జయంతి వేడుకలు

కలం, కరీంనగర్: విప్లవ వీరుడు భగత్ సింగ్ జీవిత చరిత్ర, ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ పేర్కొన్నారు. సోమవారం జమ్మికుంట (Jammikunta) మండల SFI కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

​అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు భగత్ సింగ్ అని కొనియాడారు. విద్యార్థులలో దేశభక్తి, సామాజిక బాధ్యత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు భగత్ సింగ్ చరిత్రకు పాఠ్యపుస్తకాల్లో తగిన స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ​

అలాగే జాతీయ విద్యా విధానం–2020లో భాగమైన విద్యా రంగ మార్పులపై విస్తృత చర్చ జరగాలని, ప్రశ్నించే తత్వాన్ని పెంచేలా విద్యా విధానం ఉండాలని కోరారు. విద్యను వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలని, నాణ్యమైన ప్రభుత్వ విద్యను అందరికీ ఉచితంగా అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

విద్యార్థులు భగత్ సింగ్ స్ఫూర్తితో సమాజంలో జరిగే అన్యాయాలపై ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో SFI జమ్మికుంట (Jammikunta) మండల అధ్యక్షుడు సిద్ధిక్, కార్యదర్శి అనిల్, ఉపాధ్యక్షుడు అక్షయ్, నాయకులు సన్నీ, అభిరామ్, డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read : ఆసియా గేమ్స్: పోరాడి రజతం గెలిచిన ఈషా సింగ్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>