epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రెండు రాష్ట్రాల నీటి వివాదంపై కేంద్రం కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ (Telangana), ఏపీ (Andhra Pradesh) రాష్ట్రాల నీటి వివాదాల (Water Dispute) పరిష్కారం కోసం కేంద్ర జలసంఘం కమిటీ వేసింది. దీనికి జలసంఘం చైర్మన్ నేతృత్వం వహిస్తారు. కమిటీ సభ్యులుగా కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, ఎన్ డబ్ల్యూ డీఏ, సీడబ్ల్యూసీ చీఫ్‌ ఇంజినీర్లు, రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖల కార్యదర్శులు, సలహాదారులు, ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు, చీఫ్ ఇంజినీర్లు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం రెండు రాష్ట్రాల నడుమ తలెత్తిన నీటి పంపకాలు, వాటాలు, డిశ్చార్జితో పాటు ఇతర సమస్యలకు (Water Dispute) ఈ కమిటీ పరిష్కారం చూపిస్తుందని ఉత్తర్వులలో తెలిపారు. అవసరమైతే నీటి నిపుణులు, ఆ రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద, పరిశోధనా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపి రెండు రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి జాయింట్ మీటింగ్ లు ఏర్పాటు చేస్తుంది ఈ కమిటీ.

Read Also: శ్రేయ గ్రూప్​ ఆస్తుల జప్తు.. సంస్థపై ప్రభుత్వ చర్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>