కురాష్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ.. నలుగురు అథ్లెట్లు అవుట్

కలం, స్పోర్ట్స్ : ఆసియా క్రీడల (Asian Games) కురాష్ పోటీలలో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన వేర్వేరు విభాగాల్లో పోటీపడిన నలుగురు భారత అథ్లెట్లు కూడా తమ బౌట్లలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల 90 కేజీల క్వార్టర్ ఫైనల్లో భారత అథ్లెట్ విశాల్ థాయిలాండ్ క్రీడాకారుడు కునాతిప్ చేతిలో 0-5 తేడాతో పరాజయం పాలయ్యారు. మ్యాచ్ ప్రారంభంలో విశాల్ ‘చాలా’ పాయింట్‌తో ముందంజ వేసినా, ప్రత్యర్థి వెంటనే సమం చేశారు. ఆ తర్వాత థాయ్ అథ్లెట్ సాధించిన ‘యోన్‌బోష్’ పాయింట్‌తో విశాల్ ఓటమి ఖాయమైంది.

అంతకుముందు పురుషుల 90 కేజీల ప్రీ-క్వార్టర్స్‌లో యశ్ కుమార్ చౌహాన్ తజికిస్తాన్ క్రీడాకారుడి చేతిలో పరాజయం పొందారు. మహిళల విభాగంలోనూ భారత క్రీడాకారిణులకు చేదు అనుభవమే ఎదురైంది. 57 కేజీల విభాగం రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో సంగీత 0-10 తేడాతో ఫిలిప్పీన్స్ అథ్లెట్ చేతిలో ఓడిపోయారు. అదే 57 కేజీల విభాగం రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో భారతి 0-3 తేడాతో ఇరాన్ క్రీడాకారిణి చేతిలో ఓటమి పాలయ్యారు.

Also Read : ‘ధోనీ టీమ్ కంటే గిల్ జట్టులోనే ఎక్కువ సత్తా’

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>