బాపూజీ ఆశయాల సాధనే నిజమైన నివాళి: ఎంపీ డీకే అరుణ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) కొనియాడారు. తెలంగాణ తొలిదశ ఉద్యమ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం మహబూబ్ నగర్ (Mahabubnagar) పట్టణంలో ఆయన విగ్రహానికి డీకే అరుణ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

నిరుపేదలు, వెనుకబడిన తరగతులు, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని ధారపోశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యజించిన గొప్ప త్యాగధనుడు బాపూజీ అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని ఎంపీ డీకే అరుణ అన్నారు. బలహీన వర్గాల హక్కుల కోసం బాపూజీ చేసిన పోరాటం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ జ్యోతి, నవీన్, యాదగిరి, కరుణకర్, హరికృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>