భద్రాచలం వద్ద ఉప్పొంగుతున్న గోదావరి.. లోతట్టు ప్రాంతాలకు అలర్ట్!

కలం, ​భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam Flood) వద్ద గోదావరి నది వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి నీటిమట్టం 40.80 అడుగులకు చేరుకోగా, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరదతో 8,38,117 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది.

గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 43 అడుగులకు చేరువవుతుండటంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. ​ప్రత్యేకించి లోతట్టు గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, యంత్రాంగం సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>