వైన్ షాప్‌లో ‘మందు’ కొట్టిన కోతి.. ఆ తర్వాత ఏం చేసిందంటే?

కలం, వెబ్ డెస్క్ : జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక వింతైన, ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓర్మాంఝీ బ్లాక్ చౌక్ వద్ద ఉన్న ఒక వైన్ షాప్‌లోకి అకస్మాత్తుగా ప్రవేశించిన కోతి (Drunk Monkey ) వింత చర్యలకు దిగింది. వైన్ షాప్ లో ఉన్న మద్యం సీసాలను చూసిన ఆ కోతి, ఒక బాటిల్‌ మూతను పళ్లతో తొలగించి అందులోని మద్యాన్ని ఫుల్లుగా తాగేసింది. అనంతరం, మద్యం మత్తు పెరగడంతో కోతి షాప్‌లోనే హల్‌చల్ చేయడం ప్రారంభించింది.

దీంతో దాన్ని బయటకు పంపించేందుకు యత్నించిన మద్యం షాపు సిబ్బందిపైకి దాడికి యత్నించింది. అయితే కొద్దిసేపటికే మద్యం మత్తు తీవ్రమవడంతో ఆ కోతి వైన్ షాప్ ఆవరణలోనే ఓ మూలన హాయిగా నిద్రలోకి జారుకుంది. వెంటనే రెస్క్యూ టీమ్ (అటవీ శాఖ సిబ్బంది)కు సమాచారం అందించిన వైన్ షాపు సిబ్బంది దాన్ని అలానే వదిలేశారు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున వైన్ షాప్ వద్దకు చేరుకున్నారు. ఈ సంఘటనను సెల్ ఫోన్‌లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

సురక్షితంగా రెస్క్యూ చేసిన అటవీ శాఖ

విషయం తెలసుకున్న రెస్క్యూ టీమ్ (అటవీ శాఖ సిబ్బంది) చివరికి సంఘటనా స్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న కోతిని (Drunk Monkey) చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు. దానికి ఎటువంటి గాయాలు కాకుండా సురక్షిత ప్రాంతానికి తరలించారు. కోతికి మత్తు దిగిన తర్వాత అడవిలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు.

Also Read : సింధు దూకుడు.. ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>